Vidyasagar Rao On SPB Health : బాలు అభిమానులకు మళ్ళీ తన స్వరం వినిపించాలి : విద్యాసాగర్ రావు

Vidyasagar Rao On SPB Health : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Update: 2020-08-24 09:31 GMT

Vidyasagar Rao, SP Balu 

Vidyasagar Rao On SPB Health : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. అందులో ఒకరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు.. అయనకి కరోనా సోకి ఆగస్టు 05న కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.. అయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది..అందులో భాగంగానే మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లుగా వెల్లడించారు..

ఇరవై ఏళ్ళ క్రితం గోదావరి నదీ జలాలను గ్రామగ్రామానికి తరలించడం కోసం యాత్రను చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మెడిగడ్డ నుండి పోలవరం వరకు సాగిన ఆ యాత్రలో రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాటను ఎస్పీబీ పాడారని విద్యాసాగర్ రావు అన్నారు. ఈ పాట ఆ యాత్రలో యువతను ఉర్రుతలూగించిందని, ఇప్పటికి ఆ పాట తన మదిలో మెదులుతుందని అన్నారు.. ఆ పాటను వందేమాతరం శ్రీనివాస్ ద్వారా ఎస్పీబీ గారికి చేరవేస్తే మాకు రేండు రోజుల్లో అందించారని అన్నారు. ఇక ఆయన త్వరగా కోలుకుని తన అభిమానులకు మళ్ళీ తన స్వరం వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు..

ఇక ఎప్సీబీ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌తోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని బాలు తనయుడు చరణ్ వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ అయన స్పష్టం చేశారు. 

Tags:    

Similar News