ఆ వార్తలు పుకార్లు : ఎస్పీ చరణ్

ఆ వార్తలు పుకార్లు : ఎస్పీ చరణ్
x
Highlights

SP Charan on SP Balasubrahmanyam's health: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

SP Charan on SP Balasubrahmanyam's health: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 ఆసుపత్రిలో చేరిన ఆయన, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా చేసిన పరీక్షల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్‌ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

ఉదయం నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయని ఆయన అన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వివరాలను ఎప్పకటికప్పుడు తనే అందిస్తానని.. అది నెగిటివా, పాజిటివా అనే విషయాన్ని పక్కన పెడితే ఏ విషయమైనా తన ద్వారానే తెలుస్తుందని ఓ వీడియో ఫేస్ బుక్‌లో విడుదల చేశారు. డాక్టర్ల ద్వారా తనకే ముందు విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌తోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చరణ్ తెలిపారు. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్‌డేట్‌ ఇస్తా. ధన్యవాదాలు అని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories