51 రోజులు బిడ్డ ఎంత అవస్తపడ్డాడో.. జానకీ ఎమోషనల్ వీడియో!

Janaki Gets Emotional : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన శుక్రవారం ( Sep 26) మధ్యాహ్నం మృతి చెందారు.

Update: 2020-09-28 13:18 GMT

S Janaki, SP Balasubrahmanyam

Janaki Gets Emotional : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన శుక్రవారం ( Sep 26) మధ్యాహ్నం మృతి చెందారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక వీడియోను జానకి విడుదల చేశారు. ఇందులో బాలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇందులో జానకీ మాట్లాడుతూ.. " నేను బాలుని మొదటిసారిగా నెల్లూరు దగ్గర గూడూరులో. ఒక కాంపిటీషన్‌లో చూశాను. అక్కడ పిల్లల కాంపిటీషన్ పెట్టారు.. అప్పటికి బాలు చిన్నవాడు. కాంపిటీషన్‌లో గెలిచినవారికి బహుమతి ఇవ్వడానికి నన్ను పిలిచారు. ఆ కాంపిటీషన్‌లో బాలసుబ్రహ్మణ్యం చాలా బాగా పాడాడు. అతను ఎవరిని కాపీ చేయకుండా చాలా సహజంగా పాడాడు. అప్పుడు నేను బాలుతో నువ్వు సినిమాల్లో పాడావంటే గొప్పగా రాణిస్తావు చాలా ఫేమస్ అవుతావు అని చెప్పాను... ఇదే విషయాన్ని బాలు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చారు. నేను చాలా గొప్పగా పాడారని చాలా మందికి చెప్తాను కానీ అందరూ పైకి రాలేరు కదా.. బాలుకి అదృష్టం ఉంది, భగవత్‌కృప ఉంది, తను చాలా బాగా పాడతాడు గనుక పైకొచ్చాడు అంటూ చెప్పుకోచ్చారు.

ఇక బాలుతో తానూ కలిసి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిసి పాడమని అన్నారు. తామిద్దరం పాటలతో ఆడుకునేవాళ్ళమని. పాటలతోనే పోటి పడేవాళ్ళమని ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉండేదని జానకి అన్నారు. బాలుతో ఉన్న క్షణాలు ఎప్పటికి మరిచిపోలేనని జానకి భావోద్వేగానికి గుయ్యారు. బాలు మూడు నెలల క్రితం మైసూరుకు వచ్చాడని, ఆ సమయంలో మా ఇంటికి వచ్చి భోజనం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే చివరిసారిగా తానూ కూడా మైసూరులోనే ప్రోగ్రాం చేశానని అన్నారు. " 51 రోజులు హాస్పిటల్‌లో ఉండి నానా కష్టాలు పడ్డాడు. బిడ్డ ఎంత అవస్తపడ్డాడో. ఆఖరికి మనందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని జానికి ఎమోషనల్ అయ్యారు. 

Tags:    

Similar News