దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయకండి ; ఎస్పీ చరణ్

దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయకండి ; ఎస్పీ చరణ్
x

Sp charan 

Highlights

SP charan Response On Fake News : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన శుక్రవారం ( Sep 26) మధ్యాహ్నం మృతి చెందారు.

SP charan Response On Fake News : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన శుక్రవారం ( Sep 26) మధ్యాహ్నం మృతి చెందారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. అయితే ఎస్పీబీ మరణం పట్ల సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఎంజీఎం ఆస్పత్రి గురించి కొన్ని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ చరణ్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు అయన ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. " ఈ సమయంలో నేను మాట్లాడటం సరైనదా? కాదో తెలియదు. కానీ ఇప్పుడు కచ్చితంగా అవసరం అనిపిస్తోంది. ఎందుకంటే నాన్న గారి వైద్యం అందించిన ఎంజీఎం ఆస్పత్రి గురించి కొన్ని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాన్న గారి వైద్యానికి సంబంధించిన చెల్లించాల్సిన బిల్లులు, టెక్నికల్‌ స్టాఫ్‌ విషయంలో కొన్ని పుకార్లు వస్తున్నాయి. అయితే అలాంటి ఫేక్ వార్తల పైన నేను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. నాన్నగారికి ఎంజీఎం ఆస్పత్రి ఇచ్చిన వైద్యం పట్ల మా కుటుంబమంతా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉన్నాం.. ఆయనని సొంత ఇంట్లో చూసుకున్నట్లుగా చూసుకున్నారు ఆసుపత్రి బృందం.. ఎండీ డాక్టర్‌ ప్రశాంత్‌, ఛైర్మన్‌ రాజగోపాలన్‌లు నాన్నగారు త్వరగా కోలుకోవాలని రోజు ప్రార్ధించారు. నాన్న వైద్యానికి అయిన ఖర్చులు, ఇతర వివరాలను అన్నీ త్వరలోనే వారే వెల్లడిస్తారు. దీనిపై నేను, ఎంజీఎం ఆస్పత్రి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాం. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయకండి" అంటూ చరణ్ వెల్లడించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దాదాపుగా పదహారు భాషలలో నలబై వేలకి పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు.. అయన మరణం భారతీయ సినిమాకే తీరని లోటని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories