విషాదం: ప్ర‌ముఖ గాయకుడు గుండెపోటుతో మృతి

Update: 2020-06-20 04:18 GMT

ప్రముఖ తమిళ గాయకుడు ఏఎల్. రాఘవన్‌ (87) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో మరణించారు. నిన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన ఆయనను భార్య ఎంఎన్ రాజం చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రాయపేటలోని నివాసానికి తరలించారు.

1947లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాఘవన్ వేలాది పాటలు పాడారు. ఎందరో గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ తో క‌లిసి ప‌‌నిచేశారు. అందులో కేవీ మహదేవన్‌, ఎస్‌.ఎం.సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్‌-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి లెజెండ్స్ ఉన్నారు. ప్రముఖ సింగ‌ర్స్.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జిక్కి, పి.లీలతోనూ కలిసి ఈయన చాలా పాటలు పాడారు.

Tags:    

Similar News