Legally Veer on OTT: ‘లీగల్లీ వీర్’ సినిమాకి ఓటీటీలో అద్భుత స్పందన
Legally Veer on OTT: వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, లీల సామ్సన్, దివంగత ఢిల్లీ గణేశన్, గిరిధర్ వంటి నటీనటులు నటించిన ‘లీగల్లీ వీర్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Legally Veer on OTT: ‘లీగల్లీ వీర్’ సినిమాకి ఓటీటీలో అద్భుత స్పందన
Legally Veer on OTT: వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, లీల సామ్సన్, దివంగత ఢిల్లీ గణేశన్, గిరిధర్ వంటి నటీనటులు నటించిన ‘లీగల్లీ వీర్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 27న విడుదలైంది. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించిన మలికిరెడ్డి వీర్ రెడ్డి వృత్తిరీత్యా లాయర్ కావడం విశేషం. నిజమైన లీగల్ థ్రిల్లర్‌ను తెరపై చూపించాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా హీరోగా మారారు.
కోర్టు డ్రామాపై ‘లీగల్లీ వీర్’.. ఓటీటీలో ట్రెండింగ్
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన లయన్స్‌గేట్ ప్లేలో ‘లీగల్లీ వీర్’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో టాప్-5 ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచి సినిమాకి ఉన్న క్రేజ్ ని నిరూపించుకుంది.
ఈ సినిమా తన తండ్రికి నివాళిగా తీసినట్లు వీర్ రెడ్డి వెల్లడించారు. ఈ చిత్రంలో రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. ఇతర కోర్టు రూమ్ డ్రామా చిత్రాలలో ఉన్నట్లుగా ఇందులో ఎలాంటి మెలో డ్రామా ఉండదు. కోర్టులో నిజంగా ఎలాంటి ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ పాటిస్తారనే విషయాలను ఈ సినిమాలో చూపించడం హైలైట్. ఒక మర్డర్ మిస్టరీతో పాటు, తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్, అలాగే ఇండియాకు వచ్చిన ఒక ఎన్నారైకి ఎదురైన కష్టాలను ఇందులో బాగా తెరకెక్కించారు.
“నటన నాకు కష్టంగా అనిపించింది” – వీర్ రెడ్డి
‘వీర్’ పాత్ర పోషించడం కష్టమైనప్పటికీ నిజాయతీగా చేశానని వీర్ రెడ్డి తెలిపారు. మన దేశంలో ఇప్పటివరకు ఇలాంటి లీగల్ థ్రిల్లర్ సినిమాలు పెద్దగా రాలేదని ఆయన అన్నారు. “నిజమైన కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్నాను. డబ్బింగ్‌లో కూడా ఇబ్బందులు పడ్డాను. కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ కథ నాకు చాలా వ్యక్తిగతమైనది. నా జీవిత ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని విలువలతో మలిచి ఈ సినిమాని నా తండ్రికి నివాళిగా రూపొందించాను” అని వీర్ రెడ్డి పేర్కొన్నారు.
‘లీగల్లీ వీర్’ చిత్రం ఇప్పుడు లయన్స్ గేట్ ప్లేలో తెలుగుతో పాటు హిందీలో కూడా అందుబాటులో ఉంది. ఇది డిసెంబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కానుంది.