Funky Movie Twitter Review: ‘ఫంకీ’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే..?

Funky Movie Twitter Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ జంటగా, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ'. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించి యూఎస్ ప్రీమియర్ షోల టాక్ బయటకు వచ్చింది.

Update: 2026-02-13 04:01 GMT

Funky Movie Twitter Review: ‘ఫంకీ’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే..?

Funky Movie Twitter Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ జంటగా, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ'. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించి యూఎస్ ప్రీమియర్ షోల టాక్ బయటకు వచ్చింది.విశ్వక్ సేన్ మార్క్ ఎనర్జీ, అనుదీప్ కేవీ మార్క్ కామెడీ.. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద సంస్థ తోడవడంతో 'ఫంకీ' సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. వాలంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ 'ఫంకీ' రైడ్ ఎలా ఉందో నెటిజన్ల టాక్ ద్వారా తెలుసుకుందాం.

అనుదీప్ వన్ లైనర్స్.. విశ్వక్ ఎనర్జీ

సినిమా చూసిన కొందరు నెటిజన్లు ఫుల్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అనుదీప్ ఎప్పుడూ నిరాశపరచడు. సినిమా అంతా నాన్-స్టాప్ ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పక్కా అంటూ ఒక వర్గం ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు.



సిల్లీ కామెడీ.. వీక్ స్క్రిప్ట్?

మరోవైపు మిశ్రమ స్పందన కూడా వినిపిస్తోంది. సినిమాలోని కామెడీ కొన్ని చోట్ల బాగున్నా, మరికొన్ని చోట్ల బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్లు ఉందనే వాదన వినిపిస్తోంది. కథలో బలం లేదని, కేవలం వన్ లైనర్స్ మీదనే సినిమాను నెట్టుకొచ్చారని కొందరు విమర్శిస్తున్నారు.సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని, ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని సీన్లు చూస్తుంటే జబర్దస్త్ స్కిట్‌ను ఎక్స్‌టెండ్ చేసినట్లు ఉంది తప్ప, స్ట్రక్చర్ కనిపించడం లేదు అని మరికొందరు పెదవి విరుస్తున్నారు.



బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏంటి?

నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఫస్టాఫ్ బిలో యావరేజ్‌గా ఉందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో, మాస్ ఆడియన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. అనుదీప్ మార్క్ ‘సిల్లీ కామెడీ’ని ఇష్టపడే వారికి 'ఫంకీ' నచ్చుతుంది కానీ, లాజిక్ వెతికే వారికి మాత్రం కాస్త కష్టమే అనిపిస్తోంది.







Tags:    

Similar News