Ram Charan- Upasana: మెగా ఇంట్లో సందడి.. కవలల పేర్లు వెల్లడించిన రామ్ చరణ్.. పేర్లు ఏంటో తెలుసా?

Ram Charan- Upasana Reveal Twin Names: మెగా వారసుల పేర్లు వచ్చేశాయి! రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు 'శివరామ్', 'అన్విరా దేవి' అని నామకరణం చేశారు.

Update: 2026-02-13 02:23 GMT

Ram Charan- Upasana: మెగా ఇంట్లో సందడి.. కవలల పేర్లు వెల్లడించిన రామ్ చరణ్.. పేర్లు ఏంటో తెలుసా?

Ram Charan- Upasana Reveal Twin Names: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. జనవరి 31న ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ తమ చిన్నారుల పేర్లను వెల్లడించి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

అత్యంత వైభవంగా బారసాల వేడుక: ఫిబ్రవరి 11న మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చిన్నారుల బారసాల (నామకరణ మహోత్సవం) శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు చిన్నారులకు పేర్లు ఖరారు చేశారు.

వారసుల పేర్లు ఇవే:

కుమారుడి పేరు: శివరామ్ (Shivram)

కుమార్తె పేరు: అన్విరా దేవి (Anveera Devi)

సంప్రదాయం కలిసొచ్చేలా ఈ పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'శివరామ్', 'అన్విరా దేవి' పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మనవడు, మనవరాలికి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News