Allu Arjun Pushpa Movie : బన్నీకి చరణ్ విలన్?
Allu Arjun Pushpa Movie : అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..
allu arjun pushpa movie
Allu Arjun Pushpa Movie : అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.. ఇక బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అయనని సంప్రదించగా జగపతిబాబు కూడా ఒకే అన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.. ఇక గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలలో విలన్ గా నటించారు.
ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.