Top
logo

Vijay Sethupathi about Pushpa Movie: అందుకే పుష్ప నుంచి తప్పుకున్నా

Vijay Sethupathi about Pushpa Movie: అందుకే పుష్ప నుంచి తప్పుకున్నా
X
Vijay Sethupathi (File Photo)
Highlights

Vijay Sethupathi about Pushpa Movie : అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

Vijay Sethupathi about Pushpa Movie : అల వైకుంఠపురుములో సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. పుష్ప‌క్ నారాయ‌ణ్‌గా డీగ్లామ‌ర్ లుక్ లో బ‌న్నీ అద‌ర‌గొట్టాడు. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.. ఇక బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా నుంచి తమిళ నటుడు విజయ సేతుపతి తపుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ దీనిపైనే చిత్ర బృందం ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు.. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవడం పైన స్పందించాడు.. డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల‌న‌నే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని, ఇదే విషయాన్ని ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చ‌ర్చించానని విజయ్ వెల్లడించాడు.. నా వ‌ల‌న చిత్ర బృందానికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తొద్ద‌నే ఆలోచ‌న‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని విజ‌య్ స్పష్టం చేసాడు..

ఇక ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో తమిళ నటుడు బాబీ సింహను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.. ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Web TitleKollywood Actor Vijay Sethupathi about not working in Allu Arjun Pushpa Movie
Next Story