నారా రోహిత్ కొత్త లుక్.. పుష్ప కోసమేనా?

Nara Rohith New Look : సినిమా సినిమాకోసం చాలా కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు యంగ్ హీరో నారా రోహిత్.. ఈ మధ్య

Update: 2020-09-15 10:42 GMT

Nara Rohith new look 

Nara Rohith New Look : సినిమా సినిమాకోసం చాలా కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు యంగ్ హీరో నారా రోహిత్.. ఈ మధ్య సినిమాల విషయంలో వేగం తగ్గించినా నారా రోహిత్.. ఓ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కొత్త లుక్ లో నారా రోహిత్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. లుక్ కోసం పెద్ద కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లుక్ బన్నీ హీరోగా వస్తున్న పుష్ప మూవీ కోసమే అని తెలుస్తోంది. తాజాగా నారా రోహిత్ పుష్పలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా.. సుకుమార్ సినిమాలో హీరోలు అందరూ గుబురు గడ్డంతోనే కనిపిస్తూ ఉంటారు.. ఈ సినిమాలో బన్నీ కూడా గుబురు గడ్డంతోనే కనిపిస్తున్నారు. ఇక ఈ లుక్ పట్ల నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

ఇక రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం..

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News