Top
logo

Nara Rohith : "పుష్ప" లో నారా రోహిత్.. క్యారెక్టర్ ఏంటో తెలుసా?

Nara Rohith : పుష్ప లో నారా రోహిత్.. క్యారెక్టర్ ఏంటో తెలుసా?
X

Nara Rohith

Highlights

Nara Rohith : రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక

Nara Rohith : రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం..

అయితే ఈ సినిమాలోని ఓ ముఖ్యపాత్రకి విజయ్ సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఆ పాత్ర కోసం బాబీ సింహతో పాటుగా చాలా మంది నటులను అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్ర కోసం సుకుమార్ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ని సంప్రదించడట.. పుష్పలో పాత్రకి సంబంధించిన నరేషన్ ఇవ్వగా రోహిత్ కి ఇవ్వగా సుకుమార్ కూడా ఒకే చెప్పినట్టు సమాచారం..దీని పైన త్వరలో క్లారిటీ రానుంది. నారా రోహిత్ విభిన్నమైన పాత్రలుపోషించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Web TitleYoung Hero Nara Rohith Play key Role In sukumar Pushpa movie
Next Story