Balakrishna With Anil Ravipudi : యంగ్ డైరెక్టర్ తో బాలయ్య?
Balakrishna With Anil Ravipudi : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న
Balakrishna
Balakrishna With Anil Ravipudi : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సింహం, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది.. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్ సంగీతమందిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమా పైన ఆసక్తి నెలకొంది. ఫిలిం నగర్ నుంచి వస్తున్న సమాచారం మేరకు బాలయ్య తన తదుపరి చిత్రాన్ని తమిళ్ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేసేందుకు ఫిక్స్ అయ్యారని సమాచారం.. గతంలో వీరి కాంబినేషన్ లో జై సింహ, రూలర్ చిత్రాలు వచ్చాయి, ఇందులో జై సింహ పర్వాలేదు అనిపించగా, రూలర్ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 చిత్రాన్ని చేసేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ చెప్పిన కథకి బాలయ్య కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాకి రామరావు గారు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో బాలయ్యతో సినిమా పైన ఫోకస్ పెట్టనున్నాడు.