Anil ravipudi with Balakrishna : త్వరలో సెట్స్ పైకి రామారావుగారు?

Anil ravipudi with Balakrishna : త్వరలో సెట్స్ పైకి రామారావుగారు?
x
Nandamuri Balakrishna, Anil Ravipudi(File Photo)
Highlights

కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి..

Anil ravipudi with Balakrishna : కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి..నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి హీరో కం ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చేసిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ సినిమాలతో హైట్రిక్ కొట్టాడు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో అనిల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. తాజాగా ఈ ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు అనిల్..

అయితే ఎప్పటినుంచో హీరో బాలకృష్ణతో సినిమా చేసేందుకు తహతహలాడుతున్నాడు అనిల్ రావిపూడి.. పటాస్‌ తరువాత నుంచే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు.. అయితే ఇప్పుడు బాలయ్యతో సినిమా ఒకే అయిందని తెలుస్తోంది. బాల‌య్య కోసం ఎప్పుడో రామారావుగారు అనే క‌థ సిద్దం చేశాడట అనిల్ రావిపూడి.. కానీ గత కొద్ది సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.. ఇక ఈ సినిమాని కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. దీనిపైన త్వరలో ఆఫీషియల్ అనౌన్స్ రానుంది.

ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. దాదాపుగా 70 శాతం ఈ సినిమా షూటింగ్ ముగిసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియో సినిమా పైన మంచి అంచనాలని పెంచేసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories