Vikram First Look: అదరగొడుతోన్న 'విక్రమ్' ఫస్ట్ లుక్
Vikram First Look: కమల్ హాసన్ “విక్రమ్” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
Kamal Haasan, Fahad Fazil, Vijay Sethupathi:(Twitter)
Vikram First Look: ఖైదీ సినిమాతో అదరగొట్టిన లోకేష్ కనగరాజ్ .. మాస్టర్ సినిమాతో మరో స్ట్రోక్ ఇచ్చాడు. సామాజిక కథాంశాలనే తీసుకునే కనగరాజ్ కు.. ఇప్పుడు మరో సామాజిక ఉద్యమకారుడు కమల్ హాసన్ తోడయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆ సినిమా ఫస్ట్ లుక్ అదరహో అనిపించేలా చేసింది.
కమల్ హాసన్ రాజకీయాల కారణంగా మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ 2, లోకేష్ కనగరాజ్ తో 'విక్రమ్' చిత్రం చేయనున్నారు. ఇందులో 'ఇండియన్ 2' పలు వివాదాల కారణంగా ఆగిపోయింది. దీంతో కమల్ తన మిగతా చిత్రాలపై ఫోకస్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం "విక్రమ్" చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం వీరు ముగ్గురు కనిపించే ఓ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో ముగ్గురూ గుబురు గడ్డాలతో సీరియస్ లుక్‌లో కనిపించారు.
ఈ ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఉన్నారు. ముగ్గురూ సీరియస్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం 'విక్రమ్' ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.