Fauji Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

Fauji Release Date: అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2026-01-29 15:26 GMT

Fauji Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

Fauji Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ఫౌజీని 2026 దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఫౌజీ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది.

ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీకి ప్రత్యేక స్థానం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్కేల్, పవర్‌ఫుల్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌పై మేకర్స్ కన్నేశారు. పండుగ వాతావరణం సినిమాకు అదనపు అడ్వాంటేజ్‌గా మారుతుందని అంచనా. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, టెక్నికల్‌గా కూడా ఫౌజీ హై స్టాండర్డ్స్‌లో రూపొందుతోందని సమాచారం. ప్రభాస్ అభిమానులు ఈ అప్డేట్‌తో సంబరాలు మొదలుపెట్టగా.. సోషల్ మీడియాలో #FAUZI, #Prabhas ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

డార్లింగ్ ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో హను రాఘవపూడి చూపించబోతున్నారట. రెబల్ స్టార్ సరసన సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ లాంటి సీనియర్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌‌ర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విషాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హను తన సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తారు. ఇందులో కూడా మ్యూజిక్ అద్భుతంగా ఉండనుంది. మొత్తానికి అక్టోబర్ 15 డేట్‌ను డార్లింగ్ ఫ్యాన్స్ క్యాలెండర్‌లో మార్క్ చేసుకునే టైమ్ వచ్చేసింది. దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ఫౌజీ రెడీ అవుతోంది.

Tags:    

Similar News