Siddhu Jonnalagadda: 5 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్న సిద్ధూ
Siddhu Jonnalagadda: 5 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్న సిద్ధూ
Siddhu Jonnalagadda: 5 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్న సిద్ధూ
Siddhu Jonnalagadda: డీజే టిల్లుకి ముందు గుంటూరు టాకీస్ నుంచి కృష్ణా హిస్ లీలా, ఎల్ బీ డబ్లూ ఇలాంటి కళా ఖండాలు బానే చేశాడు సిద్దు జొన్నలగడ్డ.. కాని ఏది వర్కవుట్ కాలేదు. కాని డీజే టిల్లు హిట్ తర్వాత తన ఫేట్ మారింది. డీజే టిల్లు 2 రాబోయే ముందు బడా ఆఫర్లతో సిద్దూ ఫేటే మారిపోతోంది.
మెగా స్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తీయబోయే సినిమాలో చిరు తమ్ముడిగా సిద్దూ కనిపిస్తాడట. మొన్న కొడుకన్నారు, తర్వాత అల్లు డన్నారు, ఇప్పుడు తమ్ముడంటున్నారు. పాత్ర ఏదైనా చిరు తో కలిసి మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ పట్టేశాడు సిద్దూ. ఐతే పాత్ర చిన్నదే అయినా రెమ్యునరేషన్ మాత్రం 5 కోట్లని ప్రచారం జరుగుతోంది. తనకి జోడీగా శ్రీలీలా సీన్ లో కి వచ్చింది.
డీజే టిల్లుకి ముందు పాతిక లక్షలు కూడా లేని సిద్దూ రెమ్యునరేషన్ టిల్లూగా డిజే వాయించేశాక, బాక్సాఫీస్ పేలింది. తన రెమ్యునరేషన్ ఏకంగా 2 కోట్ల కు చేరింది. కట్ చేస్తే చిరు మూవీలో ఆఫర్ వచ్చాక, 5 కోట్లకు తన పారితోషికం పెరిగినట్టు తెలుస్తోంది.
నిజానికి నారా రోహిత్, నిఖిల్, విశ్వక్ సేన్ కంటే ముందే సిద్దూ ఎప్పటినుంచో బ్రేక్ కోసం షాక్ ఇచ్చే ప్రయోగాుల చేస్తున్నాడు. కాని ఏదీ వర్కవుట్ కాలేదు. పేరు తప్ప, హిట్ కాని, రెమ్యునరేషన్ లో మార్పు కాని కనిపించలేదు.
ప్రజెంట్ సిద్దూ జొన్నల గడ్డ చిరు మూవీలో స్పెషల్ రోల్ చేస్తూనే, డీజే టిల్లు సీక్వెల్ తో వస్తున్నాడు. వరుసగా 3 సినిమాలు కమిటైన తను, 5 కోట్ల రెమ్యునరేషన్ తో దూసుకెళుతున్నాడు. నిఖిల్, అకిల్, నితిన్ తో పోలిస్తే సిద్దూ రెమ్యునరేషన్ తక్కువే అయినా, 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగిన తన రెమ్యునరేషన్ లో గ్రోత్ మాత్రం పరేషాన్ చేసేలా ఉంది.