రామ్‌ గోపాల్‌ వర్మ కరోనా వైరస్ ట్రైలర్.. బ్లీచింగ్ పౌడర్, పారాసిటిమాల్ అంటూ సెటైర్లు

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.

Update: 2020-05-26 15:48 GMT
Ram Gopal varma Coronavirus movie Trailer Image

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. కరోనాపై తన కసిని పాటల రూపంలో తీర్చుకున్న వర్మ. ఇటీవలే మియా మాల్కోవా క్లైమాక్స్ ట్రైలర్ విడుదల చేసిన వర్మ.. ఇప్పుడు కరోనా వైరస్ ట్రైలర్ విడుదల చేసాడు. లాక్‌డౌన్‌లోనే షూటింగ్ పూర్తి చేసామని చెప్పాడు ఈ దర్శకుడు. ఈ ట్రైలర్ కూడా విడుదల చేసాడు. నాలుగు నిమిషాల ఉన్న ట్రైలర్ అంతా ఒకే ఇంట్లో సాగింది.

లాక్‌డౌన్‌లో కరోనా వైరస్ పేరుతో ఫీచర్‌ ఫిల్మ్‌ చేసినట్లు వర్మ వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే ట్రైలర్ విడుదల చేసాడు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి సినిమా ఇదేనని చెప్పాడు. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు.. లాక్‌డౌన్‌లోనూ వాళ్లు లాక్డ్ డౌన్ కాలేదని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ఆఖర్లో పారాసిటిమాల్ టాబ్లెట్ , బ్లీచింగ్ పౌడర్ వైరస్ పోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మాటలను కూడా వాడుకున్నాడు. ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య మంజు దీనికి దర్శకుడు.




Tags:    

Similar News