Dhurandhar OTT Release Date: ‘ధురంధర్’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Dhurandhar OTT Release Date: శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ధురంధర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
Dhurandhar OTT Release Date: ‘ధురంధర్’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Dhurandhar OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, యువ హీరోయిన్ సారా అర్జున్ జంటగా నటించిన చిత్రం ‘ధురంధర్’. 2025 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. రూ.1400 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో ధురంధర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్క భాషలోనే (హిందీ) విడుదలై.. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా మరో రికార్డు సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.
శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ధురంధర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. థియేట్రికల్ రన్‌టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీ రన్‌టైమ్ 3.25 గంటలుగా ఉంది. 9 నిమిషాల సినిమాను తగ్గించారు. హిందీలో విడుదలైన కొన్ని రోజులకే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాలేదు. మరి ఓటీటీలో అయినా తెలుగు ఆడియో అందుబాటులో ఉంటుందో లేదో చూడాలి. మరికొన్ని గంటలు ఆగితే ఆ విషయం తెలిసిపోనుంది.
ఇప్పటికే థియేటర్లలో భారీ స్పందన దక్కించుకున్న ధురంధర్ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే రేంజ్‌లో అలరించేందుకు రెడీ అయింది. అధికారిక ప్రకటనతో అభిమానుల్లో, మూవీ లవర్స్‌లో ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. 3 గంటల 25 నిమిషాల నిడివితో ఎపిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఓటీటీ ప్రేక్షకుల కోసం 4K రిజల్యూషన్తో పాటు డాల్బీ డిజిటల్ 5.1 ఆడియోలో స్ట్రీమింగ్ కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఇంటెన్స్ డ్రామా, పవర్‌ఫుల్ స్కోర్.. అన్నింటినీ ఇంట్లోనే ఆస్వాదించొచ్చు. థియేటర్లలో మాస్ రెస్పాన్స్ తెచ్చుకున్న ధురంధర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. వీకెండ్ స్ట్రీమింగ్ ప్లాన్ చేసుకునేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ పిక్‌గా మారనుంది. మూవీ లవర్స్.. ఇక పాప్‌కార్న్ రెడీ చేసుకోండి.