Mega 158 Update: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్.. చిరంజీవి సరసన నేషనల్ అవార్డు విన్నర్!
Mega 158 Update: Mega 158 Update: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ఖరారైంది. 'మెగాస్టార్' చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు.
Mega 158 Update: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ఖరారైంది. 'మెగాస్టార్' చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు. ప్రియమణికి కథ బాగా నచ్చిందని, అందులోనూ మెగాస్టార్ సరసన కాబట్టి వెంటనే ఒకే చెప్పారట. దీనిపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ వార్తతో సినీ అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇప్పటికే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబీ కొల్లి.. ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవిని ఓ కొత్త షేడ్‌లో చూపించనున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో చిరు సరసన ప్రియమణి ఎంపిక కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రియమణి గతంలో గ్లామర్, ఎమోషన్ ప్రధాన పాత్రల్లో సత్తా చాటారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టడం కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. చిరంజీవి–ప్రియమణి కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరు కాంబో నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలు కానుందని సమాచారం. చిరంజీవి మార్చి నుంచి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారట. మెగాస్టార్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మెగాస్టార్ భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. వరప్రసాద్ గారులో చిరు సరసన నయనతార బాగా సెట్ అయ్యారు. ప్రియమణి కూడా నయన్ లానే సెట్ అవుతారని ఫాన్స్ అంటున్నారు.