Chiranjeevi: అవార్డుల ని ప్రభుత్వం మర్చిపోయింది అంటున్న మెగాస్టార్

Chiranjeevi: ప్రభుత్వం సినీ కళాకారులకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్న చిరంజీవి

Update: 2021-11-18 14:00 GMT

సినిమా ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్న చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఒకవైపు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చేతుల్లో "గాడ్ ఫాదర్", "భోళా శంకర్" సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇది దాసరి నారాయణరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా మారారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక పురస్కార వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి పరిశ్రమ కి సంబంధించిన కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడారు.

"ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయిందో, కళాకారులకి అవార్డులు కూడా తగ్గిపోయాయి. రెండు ప్రభుత్వాలు సినిమా ఆర్టిస్టులకు అందించే అవార్డుల సంగతిని పూర్తిగా మర్చిపోయింది. అందుకే ఇప్పటి నుండి రెండు రాష్ట్రాలు ఆలోచించి అవార్డుల్ని ప్రకటించి వేడుకలను కూడా నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారులకు అవార్డులు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి. పైగా ఈ సమయంలో ప్రభుత్వాలు సినిమా కళాకారులకు అవార్డులు అందించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది" అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

Tags:    

Similar News