Chandrababu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తారకరత్న నాతో చెప్పారు

Chandrababu: చాలా చిన్నవయసులోనే మరణించడం బాధాకరం

Update: 2023-02-19 07:31 GMT

Chandrababu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తారకరత్న నాతో చెప్పారు

Chandrababu: తారక రత్న మరణం చాలా దురదృష్టమని, బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తారక్ 23 రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పారాడి మరణించారని, 27న యువగళం పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటు వచ్చిందన్నారు చంద్రబాబు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందారని, తారక్ కుటుంబం.. అభిమానులు ఆయన కోసం ప్రార్థించారని చెప్పారు చంద్రబాబు చాలా చిన్న వయసులోనే మరణించడం బాధగా ఉందన్నా్రాయన ఈనెల 22వ తేదీ నాటికి 40 ఏళ్లు నిండుతాయని చెప్పారు. చిన్నతనంలోనే తారక్ మరణించడం బాధేస్తోందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి తారక్ అని, 9 సినిమాలు ఒకే రోజు అనౌన్స్ చేశారని తెలిపారు. అమరావతి అనే సినిమాకు నంది అవార్డు కూడా వచ్చిందని తెలిపారు. తారక్ ఎప్పుడూ రాజకీయంపై ఆసక్తి కనబర్చే వారని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News