Sushant Death Case : సుశాంత్ కేసులో జోరు పెంచిన సీబీఐ
Sushant Death Case :బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు రోజుకో మలుపు తిరిగుతుంది. ఈ కేసులోకి తాజాగా సీబీఐ కూడా ఎంటర్ అయిపోయింది. ఈ మేరకు
sushant singh rajput
Sushant Death Case :బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు రోజుకో మలుపు తిరిగుతుంది. ఈ కేసులోకి తాజాగా సీబీఐ కూడా ఎంటర్ అయిపోయింది. ఈ మేరకు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలిచ్చింది. ఇక సీబీఐ కూడా జోరును పెంచింది.. ఈ కేసులో భాగంగా పలువురిని ఆదివారం ప్రశ్నించింది సీబీఐ ... సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని, సుశాంత్ ఇంట్లో కుక్‌గా పనిచేస్తున్న నీరజ్ లను సీబీఐ బృందం ప్రశ్నించింది.. సుశాంత్ వాడిన ఒక మొబైల్ ఫోన్ నెంబర్ స్నేహితుడైన సిద్ధార్థ్ పిథాని పేరున ఉన్నట్లు ఇటీవల దర్యాప్తులో తెలిసింది. దీనితో సీబీఐ బృందం అతన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సుశాంత్ గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సీబీఐ రాబట్టిందని తెలుస్తోంది.
ఇక సుశాంత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించాడు. అయితే ఇదే ఆత్మహత్యే అన్నట్టుగా ముంబై పోలిసులు నిర్ధారించారు.. కానీ ఇది ఆత్మహత్య కాదని హత్యేనని పలువురు భావిస్తున్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని జూలై నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేశారు.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.