Biopic On sushanth singh Rajput : సుశాంత్ జీవితంపై బయోపిక్!

Biopic On sushanth singh Rajput : బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జులై నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా

Krishna
Published on: 23 Aug 2020 11:21 AM IST
Biopic On sushanth singh Rajput : సుశాంత్ జీవితంపై బయోపిక్!
X

 sushanth singh Rajput 

Biopic On sushanth singh Rajput : బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జులై నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు భావిస్తున్నారు.. దీనిపైన సీబీఐ విచారణ కొనసాగుతుంది..

ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్ జీవితం పైన బయోపిక్ తీయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు టైటిల్స్ ని కూడా రిజిస్టర్ చేయించారు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - బయోగ్రఫీ, సుశాంత్ , ది అన్‌సోల్వ్డ్ మర్డర్ మిస్టరీ - రాజ్‌పుత్ ఈ మూడు టైటిల్స్‌ని "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కించే సినిమాల‌కి టైటిల్స్‌గా పెట్టాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.. స్టార్ హీరోగా ఉన్న సమయంలో అకాల మరణం పొందడం చిత్రనిర్మాతలను ఎంత‌గానో ప్రేరేపించింది. అందుకే సినిమా తీయాల‌ని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని జూలై నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేశారు.. ఈ సినిమాను అభిమానుల కోసం ఫ్రీగా చూసే అవకశాన్ని కలిపించారు మేకర్స్.. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Krishna

Krishna

Next Story