Brahmanandam: ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం.. అప్పుడే లక్షల్లో ఫాలోవర్స్

Update: 2025-02-07 03:30 GMT

Brahmanandam: టాలీవుడ్ స్టార్ కామెడియన్ బ్రహ్మనందం ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బ్రహ్మనందం తానే స్వయంగా వెల్లడించారు. బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా మూవీ బ్రహ్మ ఆనందం. వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీమర్స్ తో ఇటీవలే చిట్ చాట్ ను నిర్వహించారు బ్రహ్మనందం. అయితే ఈ వేడుకలో మీమర్స్ బ్రహ్మిని అడుగుతూ సార్ మీరు ఇన్ స్టాగ్రామ్ లోకి ఎప్పుడు వస్తారు అని అడుగుతారు.

దీనికి బ్రహ్మి సమాధానమిస్తూ..మీ అందరికీ ఒక సర్ ప్రైజ్. నేను ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చాను. నా యూజర్ ఐడీ..యువర్స్ బ్రహ్మి. నేను వచ్చి వారం కంటే ఎక్కువ కాలేదని చెప్పాడు. అయితే ఈవిషయం చెప్పిన తర్వాత నుంచి బ్రహ్మికి విపరీతమైన ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే 3లక్షల ఫాలోవర్స్ ను 3 రోజుల్లో సంపాదించుకున్న బ్రహ్మి తాజాగా 6లక్షల 59వేల ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు. ఇక మొదటి పోస్టుగా తనకు ఇష్టదైవం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తితో కొలుస్తూ ఫొటోను షేర్ చేశారు.



Tags:    

Similar News