కరీనా కపూర్ ని టార్గెట్ చేసిన కంగనా!
Kangana Ranaut On Kareena Kapoor : కంగనా రనౌత్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈమె పేరే వినిపిస్తుంది.. పలువురు పైన కామెంట్స్ చేస్తూ నిత్యం
kangana ranaut and kareena kapoor
Kangana Ranaut On Kareena Kapoor : కంగనా రనౌత్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈమె పేరే వినిపిస్తుంది.. పలువురు పైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది ఈ ఫైర్ బ్రాండ్.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరవాత ముంబై పోలీసులపైన, మహారాష్ట్ర ప్రభుత్వం పైన కీలక వాఖ్యలు చేసింది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై లోని కంగనా కార్యాలయాన్ని రూల్స్ కి వ్యతిరేకంగా ఉందని కూల్చేసే ప్రయత్నం చేసింది.. దీనితో మరింతగా రెచ్చిపోయున కంగనా కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పై కామెంట్స్ చేసింది..
తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్, సారా అలీఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కూతురు) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని... వారిద్దరూ విడిపోవడానికి కరీనానే కారణమని అంటూ కీలక వాఖ్యలు చేసింది. తన తొలి హీరో సుశాంత్ తో డేటింగ్ చేయవద్దని ఆమె సవతి తల్లి కరీనా కోరిందని కంగనా చెప్పుకొచ్చింది.. కరీనాకు మీడియా సహాయపడిందని కూడా చెప్పుకొచ్చింది కంగనా.
ఇక మీడియా, బీటౌన్ ఇద్దరూ కలిసి సుశాంత్, సారా విడిపోయేలా చేశారని, ఇప్పుడు అదే గ్యాంగ్ తనని కూడా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటూ చెప్పుకొచ్చింది...ప్రస్తుతం ఆమె చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక కేదార్‌నాథ్‌లో సుశాంత్‌తో సారా 2018 లో సినీరంగ ప్రవేశం చేసింది.