బాక్సాఫీస్ వద్ద 'దేవగుడి' ప్రభంజనం: ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి!

Devagudi Movie Success Meet: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం "దేవగుడి".

Update: 2026-02-02 08:39 GMT

Devagudi Movie Success Meet: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం "దేవగుడి". పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా 'సక్సెస్ మీట్' నిర్వహించింది.

ప్రతి పాత్రకూ దక్కిన గుర్తింపు:

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "మీడియా మిత్రులు, ప్రేక్షకులు అందించిన ఈ విజయం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఉండటమే ఈ సక్సెస్‌కు కారణం. ముఖ్యంగా రఘు కుంచె పోషించిన 'వీరారెడ్డి' పాత్రకు, అభినవ్ శౌర్య, నరసింహ, అనుశ్రీల నటనకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.

హీరో కావాలన్న కలను నిజం చేసింది:

హీరో అభినవ్ శౌర్య ఉద్వేగానికి లోనవుతూ.. "హీరో కావాలని నేను కన్న కలను ఈ చిత్రం నిజం చేసింది. థియేటర్లలో నన్ను ప్రేక్షకులు 'ధర్మ' అని పిలుస్తుంటే నా శ్రమంతా మర్చిపోయాను. జాతర నేపథ్యంలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు.

తెలుగు అమ్మాయికి దక్కిన గౌరవం:

హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. "శ్వేతారెడ్డి పాత్రలో నన్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. నేను చేసిన ఫైట్స్, డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతుంటే నటిగా నా శ్రమ ఫలించిందని అనిపిస్తోంది" అని పేర్కొన్నారు.

కెరీర్ బెస్ట్ రోల్ - రఘు కుంచె:

ప్రముఖ నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. "కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. వీరారెడ్డిగా నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ రోల్. పక్కా ప్లానింగ్‌తో సినిమాను ఆడియెన్స్ వరకు తీసుకెళ్లిన రామకృష్ణారెడ్డి గారి కృషి అభినందనీయం" అని ప్రశంసించారు. నటుడు నరసింహ తోషి కూడా ఈ విజయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, అదిరిపోయే పాటలు, యాక్షన్ సీన్లతో "దేవగుడి" ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా థియేటర్లకు రప్పిస్తోంది.

Tags:    

Similar News