డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్?

Sushant Singh Rajput case : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ఈకేసులో

Krishna
Published on: 17 Sept 2020 11:48 AM IST
డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్?
X

Sushant Singh Rajput, Shraddha Kapoor

Sushant Singh Rajput case : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ఈకేసులో ముందు నుంచి నిందితురాలుగా ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటివల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆమెతో పాటుగా ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. అయితే ఎన్‌సీబీ చేసిన విచారణలో రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు.

అయితే ఇప్పుడు ఆ లిస్టు నుంచి మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె శ్రద్దాకపూర్.. సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగే డ్రగ్ పార్టీలకు రియా, సారాలతో పాటుగా శ్రద్దాకపూర్ కూడా హాజరయ్యేదని నిత్యం వారు పార్టీలు చేసుకునేవారని తెలుస్తోంది. దాదాపుగా 4 నుంచి 5 సార్లు శ్రద్దాకపూర్ డ్రగ్ పార్టీలకు వెళ్లినట్టుగా విచారణలో తేలినట్టుగా సమాచారం. ప్రస్తుతం సుశాంత్ ఫామ్ హౌస్ లోని సీసీటీవీ పైన ఎన్‌సీబీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.. త్వరలో ఆమెని విచారణకి పిలవనున్నట్లుగా సమాచారం.. ఇక రియా చక్రవర్తి వెల్లడించిన పేర్లలో రకుల్‌, సారా, డిజైనర్‌ సిమోనె ఖంబట్టా లను విచారించేందుకు ఎన్‌సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఇక శ్రద్దాకపూర్ గత ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది ఈ భామ.. బన్నీ, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఓ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దాకపూర్ ఫిక్స్ అయినట్టు సమాచారం..పాన్ ఇండియా మూవీగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. అటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీ గా ఉంది శ్రద్దా కపూర్

Krishna

Krishna

Next Story