హిందీలోకి అరుంధతి... జేజమ్మ ఎవరంటే ?

Krishna
Updated on: 28 Sept 2019 2:40 PM IST
హిందీలోకి అరుంధతి... జేజమ్మ ఎవరంటే ?
X

అనుష్క ప్రధానపాత్రలో నటించిన చిత్రం అరుంధతి.. ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి సినిమాని నిర్మించారు. జేజమ్మ పాత్రలో అనుష్క నటనకి మంచి మార్కులు పడ్డాయి. దీనితో అనుష్క రేంజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం...

ఇప్పటికే సినిమాకి సంబంధించిన రిమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ తీసుకునట్లు సమాచారం. అరుంధతి సినిమాలో అనుష్క పోషించిన జేజమ్మ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ని నిర్మాతలు సంప్రదించారని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా అనుష్క శర్మ, కరీనా కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Krishna

Krishna

Next Story