Bandla Ganesh says sorry to pawan fans : ఇంకెప్పుడు అలా చేయను.. తప్పుకు సారీ చెప్పిన బండ్ల గణేష్!

Bandla Ganesh says sorry to pawan fans: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే పేరుతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన

Update: 2020-07-25 08:57 GMT
Bandla Ganesh (File Photo)

Bandla Ganesh says sorry to pawan fans:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే పేరుతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ , ఓ పాట పెద్ద వివాదాలనే సృష్టించాయి. ఎన్నికల తర్వాత కథ అంటూ ఈ సినిమాని తెరకెక్కించిన వర్మ ఇందులో మెయిన్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్‌గా చేస్తూ చిరంజీవి, పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్, చంద్రబాబులను పోలిఉన్న నటులతో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే దీనిపైన పవన్ అభిమానులు బగ్గుమంటున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా పవర్ స్టార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేస్తూ సినిమాపైన చాలా హైప్ పెంచుతున్నాడు వర్మ.. అందులో భాగంగానే వర్మ షేర్ చేసిన ఓ ప్రమోషన్ వీడియోను లైక్ కొట్టి పవన్ అభిమానులకి షాకిచ్చారు నిర్మాత బండ్ల గణేష్. దీనితో బండ్ల గణేష్ తీరు పైన పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పవన్ అభిమాని అయితే `అదంతా కాదు బండ్ల అన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేశావ్` అని అడిగేశాడు. అయితే దీనిపైన స్పందించిన బండ్ల గణేష్ ''ఒట్టు.. ఏదో పొరపాటున జరిగి పోయింది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను. చేసిన తప్పుకు సారీ చెబుతున్నా''అని పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ తో గణేష్ ఇప్పటికే తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలని తెరకెక్కించాడు. ఇక అటు వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాని ఈ రోజు (జూలై25)న అర్జీవీ వరల్డ్ ధియేటర్ లో విడుదల చేస్తున్నట్టుగా వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ట్రైలర్ , పాటతో పెద్ద వివాదాన్ని సృష్టించిన వర్మ విడుదల తర్వాత మరెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి. 


Tags:    

Similar News