Anu Emmanuel: అయ్యో.. అను.. నిరాశ పరిచిన 'ఊర్వశివో రాక్షసివో' ఫలితం..

Anu Emmanuel: మల్లు బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ బ్యాడ్ టైమ్ ఇంకా పోయినట్లుగా అనిపించడం లేదు.

Update: 2022-11-28 12:44 GMT

Anu Emmanuel: అయ్యో.. అను.. నిరాశ పరిచిన ’ఊర్వశివో రాక్షసివో’ ఫలితం..

Anu Emmanuel: మల్లు బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ బ్యాడ్ టైమ్ ఇంకా పోయినట్లుగా అనిపించడం లేదు. నాని నటించిన "మజ్ను" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా రాకపోగా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే అల్లు శిరీష్ హీరోగా నటించిన "ఊర్వశివో రాక్షసివో" సినిమాతో గ్లామరస్ సైడ్ ను బాగా చూపించిన ఈమె లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాలతో సినిమా అంతా రచ్చ చేసింది.

అయితే అను ఇంత రెచ్చిపోయినా కూడా సినిమా మాత్రం హిట్ అవలేదు. అల్లు ఫ్యామిలీ సినిమా హిట్ అని ప్రమోట్ చేసినప్పటికీ, ఫైనల్ రిజల్ట్ మాత్రం నిరాశపరచింది అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అనుకి ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతుంది అనే చెప్పాలి. "ఊర్వశివో.." సినిమా తర్వాత ఈమెకు మరికొన్ని అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు. సినిమా కోసం బాగానే కష్టపడ్డ అను ఇమ్మాన్యుయెల్ మాత్రం అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందుతుంది అని సమాచారం.

ప్రస్తుతం అను ఇమ్మాన్యుయెల్ కోలీవుడ్ హీరో కార్తీ సరసన "జపాన్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా అయినా అమ్మడికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈమధ్యనే "సర్దార్" తో హిట్ అందుకున్న కార్తీ తో సినిమా అను కెరీర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీ సరికొత్త లుక్ తో కనిపించనున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News