Anasuya Bharadwaj: ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన అనసూయ.. అసలేం జరిగిందంటే?
Anasuya Bharadwaj: ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన అనసూయ.. అసలేం జరిగిందంటే?
Anasuya Bharadwaj: ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన అనసూయ.. అసలేం జరిగిందంటే?
Anasuya Bharadwaj: ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తనపై నెగిటివ్ కామెంట్లు చేసే వారిపై మండిపడుతూ సోషల్ మీడియా ద్వారా ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో పై అనసూయ చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
"ఇండిగో ఎయిర్ లైన్స్ అంటే నాకు ద్వేషం. దేశీయ ఎయిర్ లైన్స్ లో కూడా వారు తమ ఆధిపత్యం చెలాయించడం చాలా బాధాకరం. వారి సేవలు ఇంత నీచంగా ఉంటాయని నేను అసలు అనుకోలేదు. వారి సర్వీస్ పట్ల నేను అసంతృప్తిగా ఉన్నాను," అంటూ అనసూయ సోషల్ మీడియా లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ గురించి అనసూయ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆమెకు జరిగిన అసౌకర్యం ఏమిటి? అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
తాజాగా తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఇండిగో వారు అనసూయ కి సమాధానం ఇచ్చారు. "రాజమండ్రి విమానాశ్రయంలో మా బృందాన్ని కలిసినందుకు మా కృతజ్ఞతలు. మీ బోర్డింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవహరించారని భావిస్తున్నాము. మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నాము. మళ్లీ మీరు ఇండిగో లో ప్రయాణం కోసం స్వాగతించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి మీకు మెరుగైన సేవలను అందిస్తామని హామీ ఇస్తున్నాం," అంటూ ట్వీట్ చేశారు ఇండిగో వారు. ఇంతకీ అనసూయ ఫాలోవర్లు మాత్రం అసలు ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తున్నారు.