Adire Abhi: పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్
సైబర్ నేరగాళ్ల రెచ్చిపోతున్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్నింటికి కూడా సైబర్ నేరగాళ్ల లీకు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల రెచ్చిపోతున్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్నింటికి కూడా ఇప్పుడు లీక్ చేస్తూ.. సినిమా వాళ్లను తిప్పలు పెడుతున్నారు.. జబర్దస్త్ కమెడియన్స్ కూడా వారి వేదింపులకు గురైయ్యారు. తలపతి విజయ్ నటిస్తోన్న మాస్టర్ చిత్రానికీ సబంధించిన కొన్ని క్లిప్పులు నెట్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ వంతు వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కూడా ఇదే జరిగింది. ఎప్పుడో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభి అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలు నటించాడు. అయితే జబర్దస్త్ రావడంతో అభికి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. తాజాగా అభి 'పాయింట్ బ్లాంక్' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలో అభి పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఆయన నటించిన సినిమా విడుదలకు సిద్థంగా ఉంది. అభి చిత్రానికి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళ నుంచి వార్నింగులు వస్తున్నాయి.
అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే విడుదలకు ముందే మీ సినిమాను లీక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే నిర్మాతలు వాళ్ల వార్నింగ్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో సైబర్ గ్యాంగ్ అనంతపని చేసింది. విడుదల కాకుండానే సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. దీంతోఈ విషయంపై దర్శక నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటీటీకి అమ్మిన వాళ్లపైనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇటీవలే ఇళయ తలపతి విజయ్ నటిస్తోన్న మాస్టర్ చిత్రానికీ సబంధించిన కొన్ని క్లిప్పులు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. రేపు థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుండగా రెండు రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు మూవీ క్లిప్స్ లీక్ చేశారు. ఇలా విడుదల కావడం చిత్ర యూనిట్‌కు నిరాశను కలిగించే అంశం. దీంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది.