ఎస్పీ బాలు లేరంటే నమ్మలేకపోతున్నాను!

shobana On SP Balasubrahmanyam : దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరు అనే వార్తను కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు..

Update: 2020-10-04 13:19 GMT

shobana On SP Balasubrahmanyam : దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరు అనే వార్తను కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.. తాజాగా అలనాటి తార శోభన ఆయనని గుర్తుచేసుకున్నారు.. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి తాను నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్‌ చేశారు. " ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరు అన్న వార్తను నేను నమ్మలేకపోతున్నాను.. అలాంటి వ్యక్తి స్థానాన్ని మరెవరూ పూడ్చలేరు కూడా.. మేమిద్దరం క‌లిసి కూడా న‌టించాం. అత‌ను పోలీస్‌గా, నేను దొంగ పాత్రలో నటించాను. బాల స‌ర్ ఎన్నో ర‌కాల పాట‌ల‌తో శ్రోత‌ల‌ను అల‌రించారు" అంటూ పోస్ట్ చేసింది శోభన..

ఇక బాలు దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించారు.. జనరేషన్ మారిన కొద్ది అయన కూడా మారుతూ కథానాయకుల గొంతుకు తగట్టుగా పాటలు పాడుతుండేవారు. అందుకే బాలు పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితేనే ఆ పాటకి ఓ అందం వస్తుంది.. అసలు ఆ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపించేది.. . అలా ఒక భాష నుంచి ఒక పాట నుంచి దాదాపుగా 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు.అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన సెప్టెంబర్‌ 25న MGM ఆసుపత్రిలో మరణించారు.


Tags:    

Similar News