Rashmika Mandanna In Acharya : 'ఆచార్య' లో రష్మిక?

Rashmika Mandanna In Acharya : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో

Update: 2020-09-09 10:07 GMT

rashmika mandanna

Rashmika Mandanna In Acharya : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. తాజాగా మెగస్టార్ పుట్టినరోజున రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిరు ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందట.. కథను మలుపు తిప్పేలా ఈ పాత్ర ఉండబోతుందట.. అయితే ఇందులో ఆ పాత్రకి జోడి కూడా ఉంటుందని, ఆ పాత్రని కన్నడ భామ రష్మిక మందన్నా చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే కొరటాల ఆమెను ఫిక్స్ చేశారని సమాచారం.. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. అంతకుముందు ఈ పాత్ర కోసం కీయరాని సంప్రదించారని సమాచారం.. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ,రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు

Tags:    

Similar News