'మేము వయసుకు వచ్చాం' హీరోయిన్ కి పెళ్లి అయిపొయింది!

Niti Taylor Married : తనిష్ హీరోగా వచ్చిన ‘మేము వయసుకు వచ్చాం’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నీతి టేలర్‌ మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది.

Update: 2020-10-06 11:08 GMT

Niti Taylor Married 

Niti Taylor Married : తనిష్ హీరోగా వచ్చిన 'మేము వయసుకు వచ్చాం' సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నీతి టేలర్‌ మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమెకి చాలా మంది ఫ్యాన్ అయ్యారు. ఆ తర్వాత నీతి టేలర్‌ పెళ్లి పుస్తకం అనే సినిమాలో నటించింది కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు.. ఆ తర్వాత సినిమాలలో కనిపించని నీతి టేలర్‌ టెలివిజన్‌ స్టార్‌గా మారి బుల్లితెర షోలో కనిపిస్తూ వస్తోంది.

అయితే అభిమానులందరికీ షాక్ ఇస్తూ నీతి టేలర్‌ పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకుంది నిన్ననో మొన్నానో కాదు.. ఆగస్టు 13న ఈ భామ తన చిరకాల స్నేహితుడు పరిక్షిత్‌ భవను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియాలో వెల్లడించింది. అంతేకాకుండా తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇరు కుటుంబాల అనుమతితో కోవిడ్ కారణం వలన అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్టుగా వెల్లడించింది. అయితే కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకోనున్నట్లుగా వెల్లడించింది.

'మిస్‌ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆగష్టు 13 2020న పరిక్షిత్‌ను వివాహం చేసుకున్నాను. కరోనా దృష్ట్యా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో నా వివాహం జరిగింది. ఇప్పడు నేను గట్టిగా చెప్పగలను 'హలో హస్బండ్‌' అని నీతి టేలర్‌ వెల్లడించింది. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ లో ఉంది. ఇక నీతి భర్త భారత ఆర్మీ కెప్టెన్ కావడం విశేషం.. అయితే తమ అభిమాని నటి ఉహించని షాక్ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. 



Tags:    

Similar News