'బోర్ కొడుతోంది' అంటూ రోల్ రైడా బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు లాక్ డౌన్ సాంగ్!

బోర్ కొడుతోంది అంటూ రోల్ రైడా బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు లాక్ డౌన్ సాంగ్!
x
BiggBoss fame roll raida and others corona aware song (images from you tube video)
Highlights

కరోనా అందర్నీ ఇంటిపట్టునే ఉండేలా చేసింది. పనులన్నీ పాడైపోయి.. బయటకు వెళ్లేదారి లేక.. ఏమి చేయాలో అర్థం కాక జనం ఇంటిపట్టునే ఉండడానికి అలవాటు...

కరోనా అందర్నీ ఇంటిపట్టునే ఉండేలా చేసింది. పనులన్నీ పాడైపోయి.. బయటకు వెళ్లేదారి లేక.. ఏమి చేయాలో అర్థం కాక జనం ఇంటిపట్టునే ఉండడానికి అలవాటు పడిపోతున్నారు. దాదాపుగా నెలరోజులుగా నాలుగు గోడల మధ్యలోనే కుటుంబం అంతా ఉండాల్సి వస్తోంది.

కొద్ది మంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్నా.. చాలా వరకూ ఇంటిపట్టునే ఉంటున్నారు. బయటకు అనవసరంగా వచ్చిన వారికి పోలీసులు తమదైన శైలిలో రకరకాల కౌన్సెలింగ్ ఇచ్చి ఇల్లు కదలవద్దని హెచ్చరించి పంపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కరోనా ను ఎదుర్కోవడానికి ప్రజలను సమాయత్తం చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే పాటలతో తమ ప్రయత్నాలు తాము చేశారు. చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాక్క్ష సింగర్ రోల్స్ రైడా యూట్యూబ్ లో హడావుడి చేస్తున్నారు. బోర్ కొట్టిందా అంటూ రాక్ చేస్తున్నారు.

ఈయనకు తోడుగా బిగ్ బాస్ లో ఉంది వచ్చిన వారంతా కూడా ఇంటిపట్టునే ఉండి తలో చేయీ వేసి ఈ వీడియో హంగామా పెంచేశారు. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ పాట ట్రెండ్ అవుతోంది.

ఈ పాటలో రోల్స్ రైడా తో పాటు 'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్‌లు గీతా మాధురి, నందిని రాయ్‌, భాను శ్రీ, శ్యామల, దీప్తి నల్లమోతు, దీప్తి సునయన, పూజా రామచంద్రన్‌, సంజన, తనీష్‌, అమిత్‌ తివారీ, సామ్రాట్‌, గణేశ్‌, కిరిటీలు ఇంటి పట్టునే ఉండండి.. క్షేమంగా ఉండండి అని సందేశాన్ని ఇస్తున్నారు. ఈ వీడియో మీరు చూసేయండి.



Show Full Article
Print Article
Next Story
More Stories