Anushka Shetty Nishabdham : ఓటీటీలోనే అనుష్క 'నిశబ్ధం'!
Anushka Shetty Nishabdham : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్
Anushka Shetty Nishabdham
Anushka Shetty Nishabdham : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్ 'పెంగ్విన్', సుధీర్‌బాబు, నాని 'v' చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగానే అనుష్క 'నిశబ్ధం' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. బుధవారం అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల తేదిన అధికారికంగా ప్రకటించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటుగా అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్సకత్వం వహించారు. సినిమా ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.