Orey Bujjiga In OTT : అక్టోబర్‌ 2న 'ఆహా'లో.. 'ఒరేయ్‌ బుజ్జిగా'

Orey Bujjiga In OTT : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Krishna
Published on: 11 Sept 2020 6:38 PM IST
Orey Bujjiga In OTT : అక్టోబర్‌ 2న ఆహాలో..  ఒరేయ్‌ బుజ్జిగా
X

Orey Bujjiga

Orey Bujjiga In OTT : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్‌ 'పెంగ్విన్‌', సుధీర్‌బాబు, నాని 'v' చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో భాగంగానే రాజ్ తరుణ్ కూడా ఓటీటీలోనే సందడి చేయనున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా 'ఒరేయ్‌ బుజ్జిగా' అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటించారు.

గుండెజారి గల్లంతయిందే ఫేం విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించగా, కేకే రాధామోహన్‌ సినిమాని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ ఐన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ధియేటర్లు ఓపెన్ అయ్యే సూచన లేకపోవడంతో ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ సినిమాని అక్టోబర్‌ 2న 'ఆహా'లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ రోజు (శుక్రవారం) సోషల్‌మీడియా వేదికగా రాజ్‌ తరుణ్‌ అభిమానులకు వెల్లడించాడు..వాస్తవానికి ఈ సినిమాని మార్చ్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది.

'నిరీక్షణ దాదాపు పూర్తయ్యినట్లే. ఎందుకంటే 100శాతం వినోదాత్మకమైన 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాన్ని ఆహా వేదికగా మీ ముందుకు తీసుకురానున్నాం. ఫన్‌ మిస్‌ కాకండి' అని రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక గత కొంతకాలంగా రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలు సక్సెస్ కావడం లేదు.. ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నాడు రాజ్‌ తరుణ్‌..

Krishna

Krishna

Next Story