Shakalaka Shankar Help : ఓ మంచి పనికోసం బిక్షాటన చేసిన షకలక శంకర్!
Shakalaka Shankar Help : నటుడు షకలక శంకర్ సహాయ సేవ కార్య్రమాల్లో ఎప్పుడు ముందే ఉంటారు. తాను సంపాదిచిన దాంట్లో కొంత డబ్బను
Shakalaka Shankar
Shakalaka Shankar Help : నటుడు షకలక శంకర్ సహాయ సేవ కార్య్రమాల్లో ఎప్పుడు ముందే ఉంటారు. తాను సంపాదిచిన దాంట్లో కొంత డబ్బను సమాజం కోసం ఖర్చు పెడుతుంటారు.. ఇటీవల ఓ పెద రైతు కుటంబానికి కాడెద్దులు - నాగలిని ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఓ ఏడు కుటుంబాలను ఆదుకోవడం కోసం ఆయన ముందుకు వచ్చారు.. ఏకంగా వారికోసం బిక్షాటన చేశాడు షకలక శంకర్..
ఆ ఏడు కుటుంబాలకి ఆదుకోవడం కోసం కరీంనగర్ వీధుల్లో శంకర్ భిక్షాటన చేశారు. ఇలా భిక్షాటన చేసి దాదాపుగా 90 వేలు సమకూర్చారు.. మిగిలిన డబ్బులు తాను జోడించి, మొత్తం లక్ష రూపాయలతో కరీంనగర్‌లోని ఆ ఏడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. తనకి సహకరించిన మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇలా నెలకి ఒకసారి అయిన చేయాలని ఉందని వెల్లడించారు శంకర్..
ఇక జబర్దస్త్ షో ద్వారా షకలక శంకర్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత శంకర్ మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు.. తాజాగా పరాన్నజీవి చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. దీనికి నూతన్ నాయిడు దర్శకత్వం వహించాడు. ఇటీవలే 'లాస్ట్ గాడ్‌ఫాదర్' అనే సినిమాను శంకర్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.