Shakalaka Shankar : పెద్ద మనసు చాటుకున్న షకలక శంకర్!

Shakalaka Shankar : జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ అందరికి సుపరిచితుడే.. జబర్దస్త్ షోలో మంచి కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న శంకర్

Krishna
Published on: 21 Aug 2020 3:56 PM IST
Shakalaka Shankar : పెద్ద మనసు చాటుకున్న షకలక శంకర్!
X

Shakalaka Shankar : జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ అందరికి సుపరిచితుడే.. జబర్దస్త్ షోలో మంచి కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాకుండా పలు సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శంకర్ కష్టాల్లో ఉన్నవారికి సహయం చేశాడు. టాలీవుడ్‌లో దర్శకత్వం విభాగంలో పనిచేసే బైరు సిద్దు అనే యువకుడి కుటుంబ పరిస్థితి చూసి షకలక శంకర్ చలించిపోయాడు. వారిని ఆర్ధికంగా ఆదుకున్నాడు.

లక్షా ఇరవై వేల రూపాయలతో కాడెద్దులు, నాగలి కొని ఆ కుటుంబానికి సాయం చేశాడు. బైరు సిద్దుది స్వస్థలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి వెళ్లి స్వయంగా తన చేతులతో అందేశాడు షకలక శంకర్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక షకలక శంకర్ తాజాగా పరాన్నజీవి చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. దీనికి నూతన్ నాయిడు దర్శకత్వం వహించాడు.

Krishna

Krishna

Next Story