Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-21 01:50 GMT
Live Updates - Page 2
2020-08-21 12:24 GMT

Anil Kumar Yadav: HMTV తో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్

విజయవాడ:

- రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా..

- జూమ్ లో దాక్కున్నారు

- రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి

- ముంపు మండలాల ప్రజల్ని అప్రమత్తం చేసాము..ముందు జాగ్రత్తలు తీసుకున్నాము

- ఎప్పటికప్పుడు సీఎం ,అధికారులను ,కలెక్టర్ల ను అప్రమత్తం చేశారు

- ముంపు బాధితులను పట్టించుకోలేదని ,ప్రణాళిక లేదనడం సరైంది కాదు

- టిడిపి అంటే కరవు కాటకాలు.. చంద్రబాబు హయాంలో వర్షాలు పడ్డాయా

- చంద్రబాబు నిర్వాకం వలన గోదావరి పుష్కరాల్లో అమాయకులు చనిపోయారు

- రాయలసీమ కు నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే ..కొందరు అడ్డుకుంటున్నారు

- గండికోట ,చిత్రావతి ప్రాజెక్టు లకు నిధులు ఇవ్వలేదు

- పోతిరెడ్డిపాడు గురించి ఆలోచన చేసారా..

- రాయలసీమ ఎత్తిపోతల పథకం పై టిడిపి ఎందుకు మాట్లాడటం లేదు

- అఫెక్స్ కౌన్సిల్ కు సిద్ధం అవుతున్నాము

- ఇప్పటికే టెండర్ ప్రక్రియ అయిపోయింది

- మా ఎజెండా మాకుంది..గట్టిగా మాట్లాడతాము

2020-08-21 12:23 GMT

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

అమరావతి:

నారా లోకేష్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

- ఈ ఏడాది కోవిడ్ వైర‌స్ క‌ష్ట‌న‌ష్టాలు తెచ్చిపెట్టింది.

- క‌రోనా తెచ్చిన‌ విఘ్నాలు తొల‌గించాల‌ని వినాయ‌కుడిని మ‌న‌మంతా ప్రార్థిద్దాం.

- వైర‌స్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న‌ ద‌శ‌లో స‌మూహంగా కాకుండా ఎవ‌రి ఇంట్లో వారు వినాయ‌క‌చ‌వితిని జ‌రుపుకోండి.

- గ‌ణ‌నాథుడు క‌రుణ‌తో క‌రోనా క‌ష్టాలు త్వ‌ర‌లో తొల‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

- అంద‌రికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు.

2020-08-21 12:16 GMT

అనంతపురం :

- అక్రమంగా కర్ణాటక మద్యం ద్విచక్రవాహనంలో తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన విడపనకల్లు పోలీసులు.వారి వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం.

2020-08-21 12:15 GMT

Ananthapur: పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండా లో కర్ణాటక మద్యం పట్టివేత...

అనంతపురం:

- పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండా లో కర్ణాటక మద్యం పట్టివేత...

- ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి 1560 కర్ణాటక మద్యం బ్యాటిల్స్ స్వాధీనం చేసుకున్న పుట్టపర్తి ఎక్సైజ్ అధికారులు.

2020-08-21 12:09 GMT

Chandrababu Naidu: చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు

అమరావతి:

- చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు

- తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

- మనం చేపట్టిన పనులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని గణపతి పూజ చేస్తాం.

- అటు కరోనా, ఇటు వరదలు జనజీవనాన్ని దుర్భరం చేశాయి.

- పాలకుల బాధ్యతారాహిత్యం ప్రజల సహనానికి పరీక్షగా మారింది.

- వీటన్నింటినీ అధిగమించేలా, ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుందాం.

- కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలను కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నదే నా ఆకాంక్ష.

2020-08-21 12:06 GMT

Amaravati: అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ

అమరావతి:

- గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ

- నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

- సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాదించిన అభ్యర్ధులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

- గ్రామ స్వరాజ్యం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు.

- కానీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైనప్పటికీ చాలా మంది అపాయింట్ మెంట్ లెటర్ అందక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

- 0.25, 0.50, 0.75 & 1 మార్కుల తేడాతో అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వేలల్లో ఉన్నారు.

- వీరికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల గురించి అధికారులను సంప్రదిస్తే ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు

- ఇదే సమయంలో రెండో దఫా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైన వారు, స్వల్ప తేడాతో ఎంపికై వెయిటింగ్ లో ఉన్నవారిలో ఆందోళన మొదలైంది.

- కొత్త నోటిఫికేషన్ నిర్వహించడమంటే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్న వారందరికీ అన్యాయం చేయడమే.

- గ్రామ/వార్డ్ సచివాలయంలోని ఉద్యోగాలకు రాజీనామా చేసిన, ఇతరాత్రా కారణాలతో ఖాళీ అయిన స్థానాలను, తొలి విడత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ లిస్ట్ లో వున్న వారితో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులతో భర్తీ చేయాలి.

- అదనంగా ప్రభుత్వం ప్రకటిoచిన 3000 పోస్టులను మొదటి నోటిఫికేషన్లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో భర్తీ చేయాలి.

- అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు మిగిలిపోయాయనే కారణంతో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు.

- ప్రస్తుత పరిస్థితులలో రెండవసారి పరీక్షలు నిర్వహించి, అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం లేనందున మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్దులచే ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.

- నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

2020-08-21 12:04 GMT

Andhra Pradesh: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ ప్రెస్ మీట్..

అనంతపురం:

- రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ ప్రెస్ మీట్.

- చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కుంభకోణ లు జరిగినాయంటూ హైదరాబాద్ లో వుండి ఆరోపణలు చేస్తున్నారు

- రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే హైదరాబాద్ లో కాలం వెళ్లబుచ్చుతున్నారు

- అందరూ సామాజిక దూరం పాటిస్తుంటే చంద్రబాబు స్టేట్ డిస్టెన్స్ పాటిస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు

- 20 సంవత్సరాల క్రితం అక్రమంగా లే అవుట్లు గా చేసుకుని పేదలకు ఇళ్ల పట్టాలు లేకుండా చేస్తున్నారు

- పచ్చ చొక్కాలు వారు కోర్టు లో కేసులు వేస్తున్నారు

- జూమ్ యాప్ ద్వారా సంకేతాలు ఇస్తున్నారు... జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదని

- 90 శాతం కు పైగా హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే

- పేదలకు ఇళ్ళు పట్టాలు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి?

- జగన్మోహన్ రెడ్డి పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

- 40 సంవత్సరాల అనుభవంతో ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి

- ఇప్పటికే 23 సీట్లు ఇచ్చారు..రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవు

- ఎవరి ఫోన్ ట్యాప్ చేశారో చెప్పాలి.. ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు

- చంద్రబాబు కు పూర్తి స్థాయిలో మతిభ్రమించింది..కుయుక్తులు మానుకోవాలి

2020-08-21 11:31 GMT

Road Accident: దత్తిరాజేరు మండలం గొబ్యాం సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

విజయనగరం:

దత్తిరాజేరు మండలం గొబ్యాం సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి.

మృతుడు గొబ్యాం గ్రామానికి చెందిన వైకుంఠం చందుగా గుర్తింపు

2020-08-21 11:29 GMT

Coronavirus: జిల్లాలో మరో 571 కరోనా కేసులు నమోదు..

శ్రీకాకుళం జిల్లా..

- జిల్లాలో మరో 571 కరోనా కేసులు నమోదు..

- దీంతో 17,706 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

- కరోనా నుంచి కోలుకుని ఈరోజు 499మంది డిశ్చార్..

- ప్రస్తుతం జిల్లాలో 5,808 ఆక్టివ్ కేసులు..

2020-08-21 11:28 GMT

చంద్రబాబు కులం పేరుతో రాజకీయం చేస్తున్నాడు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్

కృష్ణాజిల్లా :

- చంద్రబాబు కులం పేరుతో రాజకీయం చేస్తున్నాడు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్

- 13 జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఆపిందా?

- కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదు,గతంలో చాలా మంది నాయకులు పని చేసారు

- కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే ముప్పు

- ఆయనకు ఉన్న సమస్యలు అన్ని కులానికి రుద్దుతాడు

- అలానే ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా.,అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకువచ్చాడు

- అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో 300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు

- సినీ. హీరో రామ్ రమేష్ హాస్పిటల్ గురించి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివాడు

- రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్ళు మాత్రమే చూస్తారా ?వేరే వాళ్ళు చూడరా

- వేరే కులం వారిని సినిమాలు చూడ వద్దని రామ్ ని చెప్పమనండి : వంశీమోహన్

Tags:    

Similar News