Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Ayyanna Patrudu Comments: ముందు మీ వాడికి అ,ఆ లు నేర్పు జోగి: అయ్యన్న పాత్రుడు.
    21 Aug 2020 5:04 PM GMT

    Ayyanna Patrudu Comments: ముందు మీ వాడికి అ,ఆ లు నేర్పు జోగి: అయ్యన్న పాత్రుడు.

    అమరావతి: జోగి రమేష్ కి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చిన టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు...

    జోగి ముందు మీ గన్నేరుపప్పు ని లైవ్ లోకి తీసుకురా ఎవడి సత్తా ఏంటో తేలిపోతుంది.

    తెలుగుకి తెగులు పట్టిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మీ వాడు చేసిన పదవిన్యాసం ఇంకా మర్చిపోలేకపోతున్నాం.

    ముందు మీ వాడికి అ,ఆ లు నేర్పు జోగి

    అన్నట్టు వాలంటీర్ని పెట్టి గెలిపిస్తావా మరి మీ పులివెందుల పిల్లి ఏంటి టిడిపి ఎమ్మెల్యేకు వైకాపా కండువా కప్పుతుంది.

    మీ నాయకుడికి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి వాలంటీర్లని పోటీలో పెట్టండి లేదా మీ పులివెందుల పిల్లి ని పోటీకి దింపినా ఒకే.

  • Somu Veerraju: వినాయక చతుర్థి శుభాకాంక్షలు: సోము వీర్రాజు
    21 Aug 2020 4:59 PM GMT

    Somu Veerraju: వినాయక చతుర్థి శుభాకాంక్షలు: సోము వీర్రాజు

    అమరావతి: సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్.

    రాష్ట్ర ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

    విఘ్నాలను తొలగించే బొజ్జగణపయ్యను భక్తి, శ్రద్ధలతో కొలిచి స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబసబ్యులకు కలగాలని దేశం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలను నిశితంగా గమనిస్తూ ప్రకృతి మూలాలను దెబ్బతీసే రసాయన రంగుల రహితంగా స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్విహించాల్సిందిగా పార్టీ శ్రేణులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను

  • Krishna River Updates: కృష్ణమ్మ పరవళ్లు
    21 Aug 2020 4:55 PM GMT

    Krishna River Updates: కృష్ణమ్మ పరవళ్లు

    విజయవాడ: రేపు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజి వద్దకు చేరనున్న భారీ వరద

    దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో అంచనా

    ఔట్ ఫ్లో కూడా భారీగా ఉండే అవకాశం

    లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

    రెవెన్యూ అధికారులతో కృష్ణలంక నదీతీర ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్

    సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ప్రజలకు తెలిపిన కలెక్టర్

  • ఉప్పొంగుతున్న‌ శబరి
    21 Aug 2020 4:51 PM GMT

    ఉప్పొంగుతున్న‌ శబరి

    తూర్పుగోదావరి: ఉప్పెంగి ప్రవహిస్తున్న శబరి,

    చింతూరు వద్ద 53 అడుగులకు చేరుకున్న శబరి వరద నీటిమట్టం

    గోదావరిలోకి భారీగా వచ్చిచేరుతున్న వరద..

  • Amaravathi Farmers Movement: ఎల్లుండి తో 250వ రోజుకు  అమరావతి రాజధాని రైతుల ఉద్యమం
    21 Aug 2020 4:48 PM GMT

    Amaravathi Farmers Movement: ఎల్లుండి తో 250వ రోజుకు అమరావతి రాజధాని రైతుల ఉద్యమం

    అమరావతి: రాజధాని రైతుల ఉద్యమం ఆదివారం నాటికి 250 వ రోజుకి చేరుతుంది

    - 250 వ రోజు కార్యక్రమానికి రాజధాని రణభేరి గా పేరు పెట్టిన జెఏసీ

    - ఉదయం 10గంటలకు అన్ని దీక్షా శిబిరాలలో రణభేరి కార్యక్రమము

    - రణభేరిలో డ్రమ్స్, పళ్ళెము, గరిట మోగించే కార్యక్రమం

    - నాగలితో కూడిన జోడ్డేడ్లు, గేదలు, గొఱ్ఱెలు, మేకలతో ప్రత్యేక రూపకం " ఆలకించు ఆంధ్రుడా అమరావతి అన్నదాత ఆక్రందన"

    - ప్రతి శిబిరంలో దళిత జె.ఏ.సి ఆధ్వర్యంలో " దగాపడ్డ దళిత బిడ్డ" ఆవేదన  

    - ప్రతి శిబిరంలో ఆయా గ్రామాల బలహీన వర్గాల మనోవేదన తెలిపేలా

    - " ఆలకించు ఆంధ్రుడా బజారున పడిన బడుగుజీవుల బ్రతుకులు" కార్యక్రమం

    - 5 కోట్ల ఆంధ్రుల ఉద్యమ సహకారాన్ని ఆర్థిస్తూ కొంగు చాచి " భిక్షాటన " కార్యక్రమం

    - నాటి ల్యాండ్ పూలింగ్ నుంచి నేటి వరకూ వివరిస్తూ " రాజధాని ప్రజల బ్రతుకు జట్కాబండి" రూపకం.

    - అమరావతి ఉద్యమ గేయాలాపన మరియు నృత్యరూపకం

    - సాయంత్రం 3 గంటలకు వెలగపూడిలో జె.ఏ. సి. నూతన ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

    - రాజధాని రణభేరికి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకుల జూమ్ వెబినార్ లో రాజధాని మహిళలతో ముఖాముఖి

    - సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన "అమరావతి వెలుగు - 5 కోట్ల ఆంధ్రుల వెలుగు " కార్యక్రమం

  • Minister Balineni send Legal Notice: క్షమాపణ చెప్పాలి,లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్తా: బాలినేని
    21 Aug 2020 4:39 PM GMT

    Minister Balineni send Legal Notice: క్షమాపణ చెప్పాలి,లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్తా: బాలినేని

    తనపై తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిన మంత్రి బాలినేని

    మొత్తం 8 మందికి లీగల్ నోటీసులు పంపిన మంత్రి బాలినేని

    తమిళనాడు లో పట్టుబడిన 5 కోట్ల నగదు తనదే అంటూ అసత్య ప్రచారం చేసిన టీడీపీ నేత నారా లోకేష్ ,బోండా ఉమా ,టీవీ 5 చైర్మన్ బిఆర్ నాయుడు,బొల్లినేని రవీంద్రనాథ్ , టీవీ అనలిస్ట్ లు కొమ్మారెడ్డి పట్టాభి రాం, కాట సుబ్బారావు, తమిళ ఛానెల్ టివి18 లకు నోటీసులు

    తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలి,లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్తా:బాలినేని   

  • Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత..
    21 Aug 2020 4:32 PM GMT

    Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత..

    నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుంచి భారీ ఇన్ ఫ్లో ...

    ఇరవై క్రస్ట్ గేట్లు ఎత్తి వేత...

    మొత్తం నాగార్జున సాగర్ కు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు...


  • Godavari Inflow updates: ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి
    21 Aug 2020 4:28 PM GMT

    Godavari Inflow updates: ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి

    తూర్పుగోదావరి -రాజమండ్రి: రాజమండ్రి- వద్ద మళ్ళీ ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి

    గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మూడో వరద ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు

    ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 19 లక్షల క్యూసెక్కులు వరకూ సముద్రంలోకి విడుదల

    కోనసీమలో మళ్ళీ పొంగుతున్న వశిష్ట , గౌతమీ,వైనతేయ గోదారి పాయలు

    మరింతగా గోదావరి వరద నీటిమట్టం పెరిగే అంచనాలు..

  • Corona Updates in chittoor: చిత్తూరులో కరోనా    ఉధృతి
    21 Aug 2020 4:24 PM GMT

    Corona Updates in chittoor: చిత్తూరులో కరోనా ఉధృతి

    చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి

    రాష్ట్రంలో వారం రోజుకుగా మొదటి మూడు స్థానాల్లో చిత్తూరు జిల్లా

    అప్రమత్తమౌతున్న అధికారులు

    భయాందోళనలో ప్రజలు

  • ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో  సీఐడీ దాడులు
    21 Aug 2020 4:20 PM GMT

    ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ దాడులు

    ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో, కార్యాలయాలపై సీఐడీ అధికారులు దాడులు చేశారు.

    క‌డ‌ప జిల్లాలోని ఖాజీపేటలో గల ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

    గతంలో ఆప్కోలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

    ఈ సోదాల్లో రూ.కోటి పైగా నగదు, 3 కిలోల బంగారం, 2 కిలోల వెండి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    గుజ్జల శ్రీనివాస్‌ ఆప్కో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వెళ్లడంతో సోదాలు నిర్వహించారు.

    ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. 

Print Article
Next Story
More Stories