Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

Update: 2021-02-20 00:57 GMT
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు లైవ్ అప్ డేట్స్ 

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘమాసం | శుక్లాపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2021-02-20 10:25 GMT

చంద్రబాబు 

*కుప్పం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

*ఫలితాలను అధికారులు తారుమారు చేశారు

2021-02-20 06:57 GMT

విశాఖ:

* విశాఖ ఉత్తర నియోజకవర్గం మీదుగా పశ్చిమ నియోజకవర్గం చేరుకున్న విజయసాయిరెడ్డి పాదయాత్ర

* స్వాగతం పలికిన నాయకులు ,కార్యకర్తలు

* స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ కు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా

2021-02-20 06:56 GMT

అమరావతి:

* మార్చి మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

* మున్సిపల్ ఎన్నికలు ముగిశాక బడ్జెట్ సమావేశాల యోచన.

* రెండు వారాలపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

* అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌లో చర్చించనున్న ఏపీ సర్కార్.

2021-02-20 06:54 GMT

విశాఖ: 

* ఎన్ ఏ డి కి చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

2021-02-20 06:52 GMT

విజయవాడ:

* భారీగా అక్రమ రేషన్ పట్టివేత

* 3 లారీలలో 90 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

* ప్రకాశంజిల్లా నుండి కాకినాడ పోర్టుకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

* అక్రమంగా తరలిస్తున్నారు అనే సమాచారం రావడంతో దాడి చేసిన విజిలెన్స్ అధికారులు

* గన్నవరం ఆర్.టి.ఓ చెక్ పోస్ట్ వద్ద చెక్ చేయగా రేషన్ బియ్యం అని నిర్ధారణ

* విజిలెన్స్ అధికారుల అదుపులో 6గురు వ్యక్తులు

* బియ్యాన్ని డి.టి.సివిల్ సప్లై గోడౌనుకి, లారీలు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

2021-02-20 06:51 GMT

విశాఖ: 

కారెం శివాజీ కామెంట్స్

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద రిలేనిరాహార దీక్షలు చెపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, సభ్యులకు సంఘీభావంగా తెలిపేందుకు రేపు పాదయాత్ర చేపడతాను

* గాజువాక మున్సిపల్ ఆఫీస్ నుండి పాదయాత్ర గాబయలుదేరి కూర్మన్నపాలెం వెళ్ళి సంఘీభావం తెలుపుతాము

* స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కానివ్వబోమని ప్రాణ త్యాగాలకయినా సిద్ధమని వెల్లడి

2021-02-20 06:40 GMT

నెల్లూరు:

- నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై జువ్వలపాలెం వద్ద సెబ్ అధికారుల తనిఖీలు.

-మత్స్యసంపద మాటున గోవా నుండి చీరాల కు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న బాలేరో వాహనాన్ని సీజ్ చేసిన SEB అధికారులు.

- సమారు రూ. 2.50 లక్షల విలువచేసే 1640 గోవా మద్యం బాటిళ్ల స్వాధీనం.

- డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.

2021-02-20 05:42 GMT

- ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విజయ్ సాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర కు అడుగు అడుగున బ్రహ్మరథం

- మర్రిపాలెం మీదుగా ఎన్ఏడి చేరుకున్న పాదయాత్ర

- ఐదు నియోజకవర్గాల పరిధిలో పలు వార్డు లలో విజయ్ సాయిరెడ్డి కి భారీగా స్వాగతం

2021-02-20 05:34 GMT

అమరావతి:

- వర్చువల్‌ పద్ధతిలో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ప్రారంభం

- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 6వ పాలకమండలి సమావేశం

- హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

2021-02-20 04:45 GMT

* విశాఖలో విజయసాయి రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. వైసీపీ నేతలు, అభిమానులు, పలు సంఘాల నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు తమ పోరాటం కొనసాగుతుందంటున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ 

Tags:    

Similar News