Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-03 00:40 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 03 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పూర్ణిమ (రాత్రి 8-46 వరకు) తదుపరి పాడ్యమి; ఉత్తరాషాఢ నక్షత్రం (ఉ.7-45 వరకు) తదుపరి శ్రవణం నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 9-38 నుంచి 11-16 వరకు), వర్జ్యం (ఉ. 11-49 నుంచి 1-27 వరకు) దుర్ముహూర్తం ( మ. 12-31 నుంచి 1-22 వరకు తిరిగి 3-04 నుంచి 3-55 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రక్షాబంధన్..ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-08-03 05:59 GMT

కామారెడ్డి : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

స్టీరింగ్ పని చేయకపోవడంతో రోడ్డు పక్కన దిగబడిన బస్సు

ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

2020-08-03 05:55 GMT

- తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో లో రక్షాబంధన్ ఘనంగా వేడుకలు.

-   ఆయన కుటుంబ సభ్యులు రాఖీ పండగను వైభవంగా నిర్వహించారు.

- రక్షాబంధన్ పండుగ సందర్భంగా మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కే తారకరామారావు గారికి రాఖీ కట్టిన  మాజీ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత.

- ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిసి రాఖీ కట్టిన టిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు.

- పండగ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, లోక్ సభ సభ్యురాలు కవితా మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, గండ్ర జ్యోతి జడ్పీ చైర్మన్

మరియు టిఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శ్రీమతి శైలిమా ఉన్నారు.

2020-08-03 05:44 GMT

నిర్మల్ కడెం:  కడెం ప్రాజేక్టు హై అలర్ట్ ప్రకటించిన అదికారులు

- ఎగువ. ప్రాంతాలలో బారీ వర్షాలు..

- బారీగా చేరుతున్న వరదనీరు

[- వరద గేట్లు ఏ క్షణానైనా ఎత్తుతామని ప్రకటించిన అదికారులు..

- దిగువ ప్రాంతాలలో పశువుల కాపరులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన అదికారులు

2020-08-03 05:37 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలో కరోనా వ్యాప్తి చెందడం వలన స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ ..

అన్ని దుకాణాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం ..

2020-08-03 02:53 GMT

రంగారెడ్డి జిల్లా..

- శంషాబాద్ పీఎస్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపైనా ట్రక్కును ఢీకొన్న కారు..

- ప్రమాదంలో ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ అక్కడికక్కడే మృతి...

- డ్రైవర్ పరిస్థితి విషమం ఆసుపత్రి కి తరలింపు...

2020-08-03 02:44 GMT

కామారెడ్డి :

- జిల్లాలో వేయికి చేరువలో కారోనా కేసులు.

- 24 గంటల వ్యవధిలో 15 కేసుల నమోదు.

- ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 కేసుల నమోదు. 17 మంది మృతి.

2020-08-03 02:36 GMT

కామారెడ్డి :

- జిల్లా కేంద్రంలో సంపూర్ణ లక్ డౌన్ ఈ నెల 5 నుంచి 14 వరకు అమలు

- అఖిల పక్షం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం లో నిర్ణయం.

- జిల్లా కేంద్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ కు తీర్మానం.

- ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని తీర్మానం

- కరోనా కట్టడికి లక్ డౌన్ ఒక్కటే సరైన మార్గమని వైరస్ వ్యాప్తి నీ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరిన ప్రతినిధులు

2020-08-03 02:34 GMT

- ప్రస్తుతం నీటిమట్టం 141.98

- గరిష్ట నీటిమట్టం‌148.00 M

- ప్రస్తుతం నీటినిల్వ 7.3939

- పూర్తి స్థాయినీటి నిల్వ 20.175 TMC.

- ఇన్ ప్లో 2823 c/s*

- అవుట్ ప్లో: 477 c/s

2020-08-03 02:32 GMT

నిజామాబాద్ :

- అప్యాయతలు, అనురాగాలతో అన్నా – చెల్లెల్లు, అక్కా – తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ రాఖీ.

- సోదర, సోదరీమణులు ఒకరికొకరు అండగా, అప్యాయతలు నిండుగా చేసుకునే పండుగ ఈ రాఖీ పౌర్ణమి.

- తన సోదరుడు గొప్పగా ఉండాలని, తనకు కొండంత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ సోదరి కట్టే రక్ష ఈ రాఖీ.

- కరోనా మహమ్మారి నేపధ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి ; స్పీకర్

2020-08-03 02:30 GMT

రాజన్న సిరిసిల్ల :

- నేడు శ్రావణ మాసం రెండో సోమవారం

- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

- మహాన్యాసా పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

- సాయంత్రం మహా లింగార్చన.. నిర్వహించనున్న అర్చకులు

Tags:    

Similar News