Exercise: ఫిట్‌గా ఉండాలంటే రోజు వ్యాయామం అవసరం లేదు.. ఇలా చేస్తే చాలు..!

Exercise: మన శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం.

Update: 2022-08-22 10:30 GMT

Exercise: ఫిట్‌గా ఉండాలంటే రోజు వ్యాయామం అవసరం లేదు.. ఇలా చేస్తే చాలు..!

Exercise: మన శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది రోజు వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా ఉంటారు. వ్యాయామంతో మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమే కానీ రోజూ గంటల తరబడి వ్యాయామం చేయనవసరం లేదని ఓ పరిశోధనలో తేలింది. వారంలో కొన్ని రోజులు వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు.

ఆరోగ్య నిపుణులు ప్రతి వారం 150 నిమిషాల మితమైన వ్యాయామం లేదా 75 నిమిషాల వేగవంతమైన వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వారాంతాల్లో లేదా వారానికి 1-2 రోజులు వ్యాయామం చేయడం వల్ల రోజువారీ వ్యాయామంతో సమానమైన ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. ఇంగ్లాండ్‌లోని లాఫ్‌బరో యూనివర్శిటీ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో వ్యాయామం గురించి పరిశోధిస్తున్నారు.

అక్కడ పరిశోధకులు ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్‌లలో 63,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల ఆరోగ్య సర్వేల నుంచి డేటాను విశ్లేషించారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వ్యాయామం చేశామని చెప్పే వ్యక్తులు నిష్క్రియ వ్యక్తులతో పోలిస్తే ముందుగానే చనిపోయే ప్రమాదాన్ని 30% నుంచి 34% వరకు తగ్గించారు. అదే సమయంలో రోజువారీ వ్యాయామం చేసే వ్యక్తులలో ఈ ప్రమాదం 35% వరకు తగ్గుతుంది.

దీని ప్రకారం రోజూ వ్యాయామం చేసేవారికీ తక్కువ వ్యాయామం చేసేవారికీ పెద్ద తేడా లేదు. వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారికి రోజూ వ్యాయామం చేసే వారితో సమానమైన ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, వారానికి రెండు రోజులు వ్యాయామం చేసేవారు ఇద్దరూ గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని 40% తగ్గించారు.

Tags:    

Similar News