BP Patients: బీపీ పేషెంట్లు అలర్ట్‌.. అన్నం విషయంలో ఈ తప్పు అస్సలు చేయొద్దు..!

BP Patients: ఈ రోజుల్లో చాలామంది బీపీతో బాధపడుతున్నారు.

Update: 2022-06-26 11:30 GMT

BP Patients: బీపీ పేషెంట్లు అలర్ట్‌.. అన్నం విషయంలో ఈ తప్పు అస్సలు చేయొద్దు..!

BP Patients: ఈ రోజుల్లో చాలామంది బీపీతో బాధపడుతున్నారు. వాస్తవానికి బీపీ ఎక్కువైనా తక్కువైనా రెండు ప్రమాదమే. బీపీ ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు సరైన ఆహారం తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. హైబీపీ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

మీకు బీపీ సమస్యలు ఉంటే ఆహారంలో వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ని తింటే ఉపయోగం. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వైట్ రైస్ తినడం వల్ల గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. అందుకే రక్తపోటు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య వ్యత్యాసం

బియ్యం పిండి ప్రోటీన్లకు మూలం. ఇందులో కొవ్వు ఉండదు. అదే బ్రౌన్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ధాన్యాలలో ఉండే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. బ్రౌన్ రైస్ అనేది కార్బ్-రిచ్ ఎండోస్పెర్మ్, ఫైబరస్ బ్రాన్ స్టోర్‌హౌజ్‌ అని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్ వండడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాని ఆరోగ్యానికి చాలా మంచిది.

Tags:    

Similar News