Health Tips: వర్షాలు మొదలైతే..వ్యాధులూ మొదలు..అంటు వ్యాధుల నుండి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి

Health Tips: వర్షాకాలంలో గాల్లో వైరస్ వ్యాప్తి చెందితే పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి.

Update: 2025-06-16 11:30 GMT

Health Tips: వర్షాలు మొదలైతే..వ్యాధులూ మొదలు..అంటు వ్యాధుల నుండి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి

పిల్లలకు వచ్చే అంటువ్యాధులు

వర్షాకాలంలో గాల్లో వైరస్ వ్యాప్తి చెందితే పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారంపై వాలినా, నీటిపై వాలినా, ఆ ఆహారాన్ని తినడం వల్ల, ఆ నీటిని తాగడం వల్ల పిల్లలకు డెంగ్యు జ్వరం వస్తుంది. మలేరియా కూడా ఈ కాలంలో ఉండే దోమల వల్లనే వస్తుంది. ఇక టైఫాయిడ్ విషయానికొస్తే కలుషితమై ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. బయట దొరికే ఆహారం ఎక్కువగా తినేవారిలో టైఫాయిడ్ తరచూ వస్తుంటుంది. దీంతోపాటు కలరా, హెపటైటిస్ లు కూడా కలుషితమై ఆహారం తినడం వల్ల వస్తాయి. శరీరంలోపల ఈ వ్యాధులు ఒక్కోసారి కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి సమయంలో కాలేయానికి వాపు వస్తుంది. అదే హెపటైటిస్‌కి కారణం అవుతుంది.

బయటపడాలంటే ఇలా చేయొచ్చు

ఈ వ్యాధుల నుండి రక్షించుకోవాలంటే పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. అలాగే దోమలు, బొద్దింకలు, చీమలు, ఎలుకలు ముట్టిన ఆహారాన్ని అసలు తినకూడదు. ఈ కాలంలో వీటికి చాలా దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు బయట పుడ్ అవాయిడ్ పూర్తిగా చేయాలి. ఎక్కడబడితే అక్కడ నీళ్లు తాగకూడదు. అలాగే వానలో కూడా ఎక్కువగా తడవకూడదు. ఒకవేళ తడిచినా వెంటనే వాళ్లకి ఆవిరి పట్టాలి. ఇక తరచూ తలస్నానాలు చేసేవాళ్లు దానిని తగ్గించాలి. అలాగే వేడి వేడి ఆహారాన్ని తినాలి. ఈ వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హాస్పటల్‌కు పరుగుపరుగున వెళ్లాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News