Health: పరగడుపున ఎప్పుడు ఈ జ్యూస్‌లు తాగకండి.. ఎందుకంటే..?

Health: పరగడుపున ఎప్పుడు ఈ జ్యూస్‌లు తాగకండి.. ఎందుకంటే..?

Update: 2022-02-15 00:30 GMT

Health: పరగడుపున ఎప్పుడు ఈ జ్యూస్‌లు తాగకండి.. ఎందుకంటే..?

Health: మీరు ఉదయాన్నే పరగడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. తాజా పండ్ల రసం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది. జ్యూస్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. చాలా మంది ఉదయాన్నే జ్యూస్‌తో మొదలు పెట్టడానికి ఇదే కారణం. కానీ పరగడుపున జ్యూస్ తాగడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

పరగడుపున పండ్ల రసాన్ని తాగవద్దు

మీడియా నివేదికల ప్రకారం.. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ పండ్ల రసారలు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లలో సిట్రస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అందరికీ హానికరం కాదు.

పరగడుపున చల్లని డ్రింక్స్‌ కూడా తీసుకోవద్దు

ఇది కాకుండా పరగడుపున చల్లటి డ్రింక్స్‌ కూడా తాగవద్దు. ఎందుకంటే ఉదయాన్నే గోరువెచ్చని నీటి వినియోగం కడుపు, శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చల్లని రసాలను తీసుకోవడం వల్ల శ్లేష్మ పొరలు దెబ్బతింటాయి. మీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే జ్యూస్ తాగే అలవాటును మానుకొని కాస్త ఆహారం తీసుకున్న తర్వాత జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇది మీకు పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Tags:    

Similar News