Heart Disease: గుండె జబ్బులు రావొద్దంటే తరచుగా ఈ పండ్లని తినాల్సిందే..!

Heart Disease: గుండె జబ్బులు రావొద్దంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి.

Update: 2022-05-17 15:30 GMT

Heart Disease: గుండె జబ్బులు రావొద్దంటే తరచుగా ఈ పండ్లని తినాల్సిందే..!

Heart Disease: గుండె జబ్బులు రావొద్దంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. సరైన సమయంలో తినడం నుంచి ఆహారంలో పండ్లు, కూరగాయల వినియోగం వరకు అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా గుండె జబ్టులు రావొద్దంటే తరచుగా కొన్ని పండ్లని తినాలి. వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా హార్ట్‌ఎటాక్‌ రిస్క్ తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. అలాంటి కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.

1. బెర్రీ పండ్లు

ఇప్పటికే గుండెపోటుతో బాధపడేవారు ఆహారంలో బెర్రీలను క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను సురక్షితంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

2. రాస్ప్బెర్రీస్ పండ్లు

రాస్ప్బెర్రీస్ గుండెకు చాలా మేలు చేస్తాయి. చిన్నగా కనిపించే ఈ పండును నాలుకపై పెట్టుకోగానే సులభంగా కరిగిపోతుంది. నిజానికి దీన్ని తినడం వల్ల గుండెకు రక్తాన్ని చేరే సిరలు ఫిట్‌గా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

3. ద్రాక్ష

ద్రాక్ష గుండెకు చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి ద్రాక్షలో పెద్ద మొత్తంలో పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణ ఉంటుంది. ఈ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

4. యాపిల్

హృద్రోగులు ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవచ్చు. నిజానికి దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. గుండె జబ్బులకు యాపిల్ దివ్యౌషధం. హై బీపీ, గుండెలో బ్లాకేజీ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఒక యాపిల్‌ను తీసుకోవాలి. 

Tags:    

Similar News